Mane Praveen

Sep 26 2023, 19:27

లెంకలపల్లి: వినాయకుడి పూజలో పాల్గొన్న దాసరి వెంకన్న దంపతులు

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా..  గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నవరాత్రి గణేష్ పూజలలో భాగంగా, మంగళ వారం, గ్రామానికి చెందిన దాసరి వెంకన్న దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాసరి గణేష్, శివ లు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA STREETBUZZ NEWS APP

Mane Praveen

Sep 26 2023, 12:30

NLG: క్షేత్ర పర్యటన నిమిత్తం సీసీఎంబి హైదరాబాద్ వెళ్లిన ఎన్జీ కళాశాల విద్యార్థులు
నల్గొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ  కళాశాల మైక్రో బయాలజీ మరియు బయోటెక్నాలజీ గ్రూప్స్ విద్యార్థులు, ఈ రోజు క్షేత్ర పర్యటన నిమిత్తం సెంటర్ ఫర్ సెల్లులార్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబి) హైదరాబాడ్ కు "ఓపెన్ డే - వన్ నేషన్ వన్ ల్యాబ్" సందర్భంగా, శాస్త్రీయ పరిశోధనలు ప్రత్యక్షంగా చూసి సైంటిఫిక్ రీసెర్చ్ ను తెలుసుకోవడానికి, సీసీఎంబి హైదరాబాద్ కి వెళ్లారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్ శ్యామ్ తెలిపారు. మైక్రో బయాలజీ మరియు బయోటెక్నాలజీ విభాగాధిపతి నాగరాజు మాట్లాడుతూ.. నేషనల్ సైంటిఫిక్ ల్యాబ్స్ సందర్శించడం ద్వారా ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలు ఏ రంగాలలో ఏ విధంగా పరిశోధన చేస్తున్నారు, పరిశోధన ల్యాబ్ లలో ఉండేటువంటి అత్యాధునిక పరికరాలు ప్రత్యక్షంగా విద్యార్థులు చూడటం ద్వారా, ఆ పరికరాలు పనిచేసే విధానం ప్రస్తుతం దేశీయ అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన విధానాన్ని అర్థం చేసుకుంటారని, విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి శాస్త్రవేత్తల ద్వారా అర్థం చేసుకుంటారని, భవిష్యత్తులో విద్యార్థులు పరిశోధనా రంగంలో రాణించటానికి ఈ సైంటిఫిక్ విజిట్ విద్యార్థులలో శాస్త్రీయ పరిశోధన స్ఫూర్తిని నింపుతుందని , ప్రస్తుత విద్యార్థులే భవిష్యత్ భారత దేశంలో పరిశోధకులుగా తయారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోస్న, జంతు శాస్త్ర అధ్యాపకురాలు, డాక్టర్ దుర్గాప్రసాద్, గ్రంథ పాలకులు, మల్లేష్ ఫిజికల్ డైరెక్టర్ , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP

Mane Praveen

Sep 26 2023, 08:28

TS: వినాయకుడి పూజలో పాల్గొన్న ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి
నల్లగొండ: పట్టణంలోని అక్కచెల్మా 26వ వార్డు వినాయకుని దగ్గర పూజా కార్యక్రమం లో సోమవారం, ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ కంజర వాయిద్యకారుడు నాగుల శ్రీనివాస్, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA

Mane Praveen

Sep 25 2023, 20:15

NLG: టీఎస్పీఎస్సీ ని రద్దు చేయాలని బీఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి (వీడియో)
టీఎస్పిఎస్సి ని రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు నల్లగొండలో బీఎస్పీ నాయకులు కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. కార్యక్రమంలో పలువురు బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 25 2023, 17:25

IBP: పలువురికి నియామకపు పత్రాలు అందజేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని,  ఇబ్రహీంపట్నం మండల ఓబీసీ సెల్ చైర్మన్ గా పసుల వినోద్ కుమార్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఓబీసీ సెల్ చైర్మన్ గా పండాల శ్రీనివాస్ గౌడ్ నియమితులు అయ్యారు, వారికీ టిపిసిసి వైస్ ప్రెసిడెంట్  మల్ రెడ్డి రంగారెడ్డి సోమవారం నియామకపు పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఓబీసీ సెల్ చైర్మన్ సుబ్బురు పాండు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎదుళ్ల పాండు రంగారెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌని బాలరాజ్ గౌడ్, ఆకుల ఆనంద్ కుమార్, కౌన్సిలర్ ఆకుల మమత, సీనియర్ నాయకుడు మంకాల శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మంకాల కరుణాకర్, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్, సంతోష్, కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS RR DIST

SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP

Mane Praveen

Sep 25 2023, 17:01

నల్లగొండ కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టర్ ఆఫీస్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 20 తేదీ నుండి నిరవధిక సమ్మె కొనసాగుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవరిస్తుందని ఆరోపించారు. 2001 సంవత్సరం లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ఆనాటి ప్రభుత్వం నేటి వరకు విజయవంతంగా కొనసాగుతుంది. కానీ మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు మాత్రం తొలిగిపోలేదు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స్వయంగా 3000 రూపాయలు ఇస్తామని ప్రకటించి జీవో విడుదల చేసినా, నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. గత ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల కార్మికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అప్పులు చేసి వంట చేస్తే, o కార్మికులకు బిల్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేకుండా ప్రకటన చేస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పంట కార్మికులకు ఇచ్చే వేతనంతో పాటు కమిషన్ పెంచాలని ఆయన కోరారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించి నెలకు 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అకారణంగా వంట కార్మికులను తొలగించరాదని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు అకారణంగా మరణిస్తే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే వంట సామాను, సంబంధించిన సామాగ్రిని సరఫరా చేయాలి. కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న వేతనాలను ప్రభుత్వం వంట కార్మికుల గౌరవ వేతనం 3000 తక్షణమే నిధులను విడుదల చేయాలని కోరారు. ధర్నా అనంతరం అడిషనల్ కలక్టర్ కు మెమొరాండం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జే జంగమ్మ, కార్యదర్శి బంటు రాజేశ్వరి, జిల్లా కౌన్సిల్ సభ్యులు జే వెంకట రాములు, ఏ మల్లయ్య, సైదులు, లక్ష్మయ్య, శేఖర చారి, సైదమ్మ, వెంకటమ్మ, సాలమ్మ, అలివేలు, విజయ, మల్లమ్మ, నారమ్మ, ఫాతిమా, లక్ష్మి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Sep 25 2023, 15:55

NLG: మెడికల్ కాలేజీ కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించండి: జిల్లా కలెక్టర్ కు మెమొరాండం
నల్లగొండ: మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇప్పించాలని, కొత్త టెండర్ వెంటనే పూర్తి చేయాలని, మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం AITUC ఆధ్వర్యంలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు జిల్లా కలెక్టర్ కు మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజిలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలల దాటిపోయినా నేటికీ వేతనాలు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని అన్నారు. జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి, మరియు జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని దేవేందర్ రెడ్డి కోరారు. ప్రిన్సిపాల్, కాంట్రాక్టర్ ఇద్దరి మధ్య లో కార్మికులు నలిగిపోతున్నారని అన్నారు. టెండర్ నోటిఫికేషన్ వేసి 10 నెలలు దాటి పోతున్నా, నేటి వరకు పూర్తి చేయకుండా కాలేజీ యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని తెలిపారు. రాష్ట్రం మొత్తం హాస్పిటల్ కార్మికుల వేతనాలు పెరిగినా,నల్లగొండ మెడికల్ కాలేజీలో పనిచేసే కార్మికులకు మాత్రం నేటికీ పాత జీతాలే ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో AITUC మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం. డి జకీర్, అండాలు, చెంద్రమ్మ, స్వర్ణ, విజయ, రేణుక, కవిత, చంద్రమ్మ, కోటేశ్వరి, సీత, లక్ష్మి, శిల్ప, జమీర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA

STREETBUZZ NEWS APP

Mane Praveen

Sep 25 2023, 14:56

మద్దూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నారాయణపేట ఎస్పీ


TS: నారాయణ్ పేట ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, ఆకస్మికంగా మద్దూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా ఉంటూ, వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని.. ప్రజలకు మంచి సేవలు అందించాలని పోలీస్ అధికారులకు సూచించారు.SB NEWS SB NEWS NARAYANPETSB NEWS TELANGANA STREETBUZZ NEWS NATIONAL NEWS APP

Mane Praveen

Sep 25 2023, 14:17

NLG: ప్రారంభమైన ఆశాల నిరవధిక సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో ఆశా వర్కర్ ల నిరవధిక సమ్మె  సోమవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు నిర్ణయించాలని,  రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్స్ ను పరిష్కరించాలని కోరుతూ.. రాష్ట్రంలో అనేక పోరాటాలు నిర్వహించాము, గతంలో 106 రోజులు సమ్మె చేశారు. కలెక్టరేట్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ల ముందు అనేకసార్లు ధర్నాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు కూడా నిర్వహించారు. ఇంకా అనేక రూపాల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఇటీవల సెప్టెంబర్ 11న కోఠి, హైదరాబాద్ హెల్త్ కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశాలతో ధర్నా నిర్వహించి, అదే రోజు హెల్త్ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనేక సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో నేటికీ ఫిక్స్డ్ వేతనం నిర్ణయం జరగకపోవడంతో.. ఆశా వర్కర్ లు తీవ్రమైన ఆందోళన గురి అవుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్ప మార్గం లేదని సెప్టెంబర్ 25 నుండి రాష్ట్రంలో అన్ని పిహెచ్సి సెంటర్లో ఆశా వర్కర్లు సమ్మెకు దిగారు.  వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో గత 32 సంవత్సరాలు మైదాన ప్రాంతంలో 18 సంవత్సరాల నుండి ఆశా వర్కర్లకు రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వీరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏర్పుల యాదయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, భీమనపల్లి అరుణ, పందుల పద్మ, కాలం సుజాత బుసిరెడ్డి, ధనమ్మ, మెండు విజయమ్మ,కొయ్య మంజులమ్మ, ఎస్కే సైదా బేగం, ఆయిల్ల కలమ్మ, కే.సునీత, పల్లె కౌసల్య, ఐతరాజు సునీత, లపంగి తబిత,  లపంగి దుర్గమ్మ, పొగాకు అలివేలుమంగ, బోయపల్లి యాదమ్మ, దేశగోని మంజుల, రోజా, తదితరులు సమ్మెలో పాల్గొన్నారు
SB NEWS NALGONDA

SB NEWS TELANGANA


Mane Praveen

Sep 25 2023, 10:19

ప్రపంచంలోనే జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం అంబేద్కర్: రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రజిని సాయిచంద్

నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం సరంపేట గర్షగడ్డ గ్రామంలో, ఆదివారం నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద రజిని సాయి చంద్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, తదితరులు  హాజరై అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసి అనంతరం  ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద రజిని సాయి చంద్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభను జ్ఞాన సభ అని, ప్రపంచంలో జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం ఎవరు అంటే? అది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని చెప్పవచ్చని ఆమె మహనీయుడు అంబేద్కర్ ను కొనియాడారు.
కార్యక్రమంలో  పలువురు నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
SB NEWSSB NEWS NALGONDASTREETBUZZ NEWS NALGONDASTREETBUZZ NEWS TELANGANASB NEWS NATIONAL NEWS APP